Header Banner

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొన్న కారు.. ఆరుగురు దుర్మరణం!

  Fri May 23, 2025 21:14        India

ఏపీలోని ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఒక లారీ, కారును బలంగా ఢీకొన్న ఘటనలో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో మరో ఇద్దరు గాయపడగా, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. జిల్లాలోని కొమరోలు మండలం తాటిచెర్లమోటు సమీపంలో ఈ విషాదకర సంఘటన జరిగింది. బాధితులంతా నంద్యాల జిల్లాలోని మహానంది క్షేత్రాన్ని దర్శించుకుని తిరిగి తమ స్వస్థలానికి వెళుతుండగా ఈ ప్రమాదం బారిన పడ్డారు.బాపట్ల జిల్లా స్టువర్టుపురం గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు మహానంది దర్శనం కోసం కారులో వెళ్లారు. దైవదర్శనం ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో, ప్రకాశం జిల్లా కొమరోలు మండలం తాటిచెర్లమోటు వద్దకు రాగానే, ఎదురుగా వేగంగా వస్తున్న లారీ వీరి కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జు అయింది. ప్రమాదంలో గజ్జల అంకాలు (50), గజ్జల జనార్ధన్, గజ్జల భవాని (20), గజ్జల నరసింహ (20), సన్నీ అక్కడికక్కడే మృతి చెందారు. మరణించిన వారిలో మరొకరి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. గాయపడిన వారిని జీతన్, శిరీషగా గుర్తించారు. వీరిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

 

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు అదిరిపోయే వార్త.. కొత్తగా కేబుల్ బ్రిడ్జ్! రూట్ లోనే ఫిక్స్ - నేషనల్ హైవేకు దగ్గరగా.!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం.. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషితో చంద్రబాబు భేటీ!

 

హార్వర్డ్‌కు ట్రంప్ సర్కార్ షాక్! అంతర్జాతీయ విద్యార్థుల ప్రవేశంపై నిషేధం!

 

గోల్డ్ లవర్స్ ఇక కొనేసేయండి..! బంగారం ధర తగ్గిందోచ్.. ఎంతంటే.?

 

వైసీపీ మాజీ మంత్రికి అష్టదిగ్బంధన! లుక్ అవుట్ నోటీసులు జారీ!

 

వామ్మో.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. దెబ్బకు మళ్లీ లక్షకు చేరువలో!

 

స్కూల్ బస్సుపై సూసైడ్ బాంబ్! నలుగురు చిన్నారులు స్పాట్.. 38 మందికి సీరియస్!

 

జగన్‌ను కోర్టుకు రప్పిస్తా! అప్పటి వరకు నిద్రపోను!

 

విజయవాడలో మరో ఇంటిగ్రేటెడ్‌ బస్​ టెర్మినల్‌..! పీఎన్‌బీఎస్‌పై తగ్గనున్న ఒత్తిడి!

 

ఢిల్లీ పర్యటనకు చంద్రబాబు.. నెల రోజుల్లో రెండోసారి! ఈసారి ఎందుకు వెళుతున్నారంటే?

 

ఖరీఫ్ సాగు లక్ష్యంగా మంత్రి అచ్చెన్న కీలక మార్గదర్శనం! రైతు సంక్షేమమే టార్గెట్!

 

టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!

 

ఏపీ రైతులకు శుభవార్త.. ఈ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు! వెంటనే దరఖాస్తు చేయండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations